Welcome, Guest   [ Register | Sign In | Take a tour | Adult Filter: On ]

మాట ఇస్తావు కదూ..?!
















నీ కళ్లు...
నవ్వుల పువ్వులై పలుకరించాలని

నీ చూపు...
వెండి వెలుగులు విరజిమ్మాలని

నీ పెదవులు...
ఎల్లప్పుడూ నిజమే చెప్పాలని

నీ ముఖం...
ప్రశాంతతకు మారుపేరవ్వాలని

నీ మాటలు...
నేనున్నాననే ధైర్యాన్నివ్వాలని

నీ మౌనం...
మాటల సీతాకోకలై ఎగరాలని

నీ చేతులు...
పదిమందికి ఆసరా అవ్వాలని

నీ నడక...
అందరూ నిన్నే అనుసరించాలని

మాట ఇస్తావు కదూ..?!
నిరాకరణ